CBSE సరికొత్త రూల్స్.. ఆ పరీక్షకు బోర్డు ఎగ్జామ్స్ లేవు!
karanam broadcasting private limited · Jobs, OH · 2 days ago
OTHRFull-time
కొత్త నియమాలు
- 2026-27 విద్యా సంవత్సరం నుంచి 9వ తరగతిలోకి అడుగుపెట్టే విద్యార్థులందరూ తప్పనిసరిగా మూడు భాషలను చదవాలి.
- మూడో భాష (R3) కు బోర్డు పరీక్షలు ఉండవు, కేవలం పాఠశాల స్థాయి ఇంటర్నల్ అసెస్మెంట్ మాత్రమే ఉంటుంది. 10వ తరగతి వరకు ఈ మూడో భాషకు అధికారిక సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు ఉండవు.
ఫెయిల్ అయితే నియమాలు
- 9వ తరగతిలో మూడో భాష (R3) ఇంటర్నల్ పరీక్షల్లో క్వాలిఫై కాకపోయినా, విద్యార్థిని 10వ తరగతికి ప్రమోట్ చేస్తారు.
- 10వ తరగతిలో ఉన్నప్పుడు ఆ మూడో భాషను ఖచ్చితంగా క్లియర్ చేయాల్సి ఉంటుంది.
- సీబీఎస్ఈ సెకండరీ పాస్ సర్టిఫికేట్ (10వ తరగతి పాస్ సర్టిఫికేట్) అందుకోవాలంటే మూడో భాషలో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి.
- 10వ తరగతి ఇంటర్నల్స్లో కూడా ఫెయిల్ అయితే, ఫైనల్ ఫలితాలకు ముందే మరోసారి పరీక్ష (Re-assessment) రాసే అవకాశం ఉంటుంది.
మూడు భాషల ఎంపిక విధానం
- కనీసం రెండు భాషలు భారతీయ భాషలై (Bhartiya Bhashas) ఉండాలి.
- ఆప్షన్ 1: మొదటి రెండు భాషలుగా హిందీ, తమిళం ఎంచుకుంటే, మూడో భాషగా ఇంగ్లీష్ లేదా ఫ్రెంచ్ వంటి విదేశీ భాషను ఎంచుకోవచ్చు.
- ఆప్షన్ 2: మొదటి రెండు భాషలుగా తమిళం, ఇంగ్లీష్ ఎంచుకుంటే, మూడో భాష (R3) గా ఖచ్చితంగా ఏదైనా ఒక భారతీయ భాషనే ఎంచుకోవాల్సి ఉంటుంది.
- 2026-27 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు (పాత బ్యాచ్) మూడో భాష నిబంధన నుండి మినహాయింపు పొందుతారు.