అమ్మాయిలకు భారత ఆర్మీ లక్కీ ఛాన్స్.. ఎగ్జామ్ లేకుండానే భారీ జీతంతో ఉద్యోగాలు..!
ఖాళీలు
- SSC (W) Tech – 68 : 29 పోస్టులు
- Widows of Defence Personnel : 2 పోస్టులు
- SSC (W) Tech – 68 (Special Entry) : 1 పోస్టు
- SSC (W) Non-Tech (Non-UPSC) – 125 : 1 పోస్టు
విద్యార్హతలు
SSC (Tech) పోస్టులకు: కింది ఇంజినీరింగ్ విభాగాల్లో BE/B.Tech పూర్తి చేసి ఉండాలి:
- సివిల్ ఇంజినీరింగ్
- కంప్యూటర్ సైన్స్
- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
- ఎలక్ట్రికల్
- ఎలక్ట్రానిక్స్ / ECE
- మెకానికల్
- నోటిఫికేషన్‌లో పేర్కొన్న ఇతర ఇంజినీరింగ్ బ్రాంచ్‌లు
ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థినులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే నోటిఫికేషన్‌లో పేర్కొన్న గడువులోపు డిగ్రీ పూర్తి చేసి మార్కుల మెమో సమర్పించాలి.
SSC (W) Non-Tech పోస్టులకు: ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉంటే సరిపోతుంది.
వయోపరిమితి
2027 ఏప్రిల్ 1 నాటికి అభ్యర్థుల వయస్సు 20 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి (2000 ఏప్రిల్ 1 నుంచి 2007 మార్చి 31 మధ్య జన్మించిన వారు అర్హులు). డిఫెన్స్ పర్సనల్ వితంతు అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 35 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ
ఈ నియామకాల్లో రాత పరీక్ష ఉండదు.
- దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్ (విద్యార్హతలు, గ్రాడ్యుయేషన్ మార్కుల పరిశీలన)
- SSB (Services Selection Board) ఇంటర్వ్యూ (సైకాలజికల్ టెస్టులు, గ్రూప్ టాస్కులు, వ్యక్తిగత ఇంటర్వ్యూలు)
- మెడికల్ పరీక్ష (మెడికల్ ఫిట్‌నెస్ తప్పనిసరి)
- తుది మెరిట్ లిస్ట్
జీతభత్యాలు
- ట్రైనింగ్ సమయంలో స్టైపెండ్: నెలకు రూ.56,100
- శిక్షణ పూర్తయ్యాక అధికారిగా నియామకం పొందిన వారికి జీతం: నెలకు రూ.56,100 నుంచి రూ.1,77,500 వరకు
- అదనపు ప్రయోజనాలు: వివిధ అలవెన్సులు, మిలిటరీ సర్వీస్ పే, ట్రావెల్, వైద్య సదుపాయాలు, క్యాంటీన్ ప్రయోజనాలు, అధికారిక నివాసం, పింఛన్ (వర్తించే నిబంధనల ప్రకారం)
దరఖాస్తు గడువు
- దరఖాస్తుల ప్రారంభం: ఇప్పటికే ప్రారంభమయ్యాయి
- చివరి తేదీ: ఆగస్టు 6, 2026
దరఖాస్తు విధానం
అభ్యర్థులు ఇండియన్ ఆర్మీ అధికారిక రిక్రూట్‌మెంట్ పోర్టల్‌లోకి వెళ్లి ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి. దరఖాస్తు చేసేముందు విద్యార్హతలు, వయోపరిమితి, అవసరమైన పత్రాలు, ఫిజికల్ స్టాండర్డ్స్, మెడికల్ అర్హతలు వంటి అన్ని వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో పరిశీలించండి.